PDPL: అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్రు హనుమాన్ రెడ్డి అనారోగ్యంతో మంచిర్యాల హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోమవారం హాస్పిటల్కి వెళ్లి వారిని పరామర్శించి, సరైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కూడా ఎమ్మెల్యేతో కలిసి ఉన్నారు.