కోనసీమ: జిల్లా SP రాహుల్ మీనా ఆదేశాల మేరకు DSP సుంకర మురళీమోహన్ స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వ్యాపారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పండుగల సీజన్‌కు సంబంధించిన నిబంధనలపై పోలీసులు కీలక సూచనలు చేశారు. అన్ని వ్యాపార సముదాయాలు, దుకాణాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను అమర్చుకోవాలని పోలీసులు కోరారు.