జనగామలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 90 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ప్రజా విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాని అన్నారు. ప్రజావాణితో ఎంతో మంది సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజావాణిలో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.