పెద్దపల్లి మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుధ్య నిర్వహణను మెరుగుపర్చాలని ఆదేశించారు. ప్రసవాల సంఖ్య పెంచేందుకు, గర్భిణీలకు 100% ఏఎన్సి నమోదు చేయాలని, సకాలంలో టీకాలు వేయాలని సూచనలు ఇచ్చారు. వివిధ విభాగాలను కూడా పరిశీలించారు.