VSP: విశాఖ సాగరతీరం వెంబడి బీచ్వ్యర్థాలను లేకుండా నిత్యం పరిశుభ్ర పరచడంతో పాటు బీచ్ స్వీపింగ్ యంత్రాల పనితీరును మెరుగుపరచాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఆర్కే బీచ్‌లో సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన స్లీపింగ్ యంత్రాలను పరిశీలించారు. పర్యాటకులకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు పూర్తిస్థాయిలో కల్పించి బీచ్‌ను సుందరంగా తీర్చిదిద్దాలన్నరు.