ADB: గొర్రెల కాపరుల సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ హామీ ఇచ్చారు. ఇటీవల ఎన్నికైన నూతన జిల్లా అధ్యక్షుడు గవ్వల సాయి చైతన్య, ఉపాధ్యక్షుడు కేమ రాకేష్ సోమవారం ఎంపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ వారికి శాలువతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో సంఘం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.