SRD: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రాంగానే ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.