TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం బోర్డు ఛైర్మన్ పదవిపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. జనసేన పార్టీ నాయకుడు కొట్టే సాయి ప్రసాద్‌ను దేవస్థానం ఛైర్మన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొన్ని రోజులుగా ఈ ఛైర్మన్ పదవిపై ఊగిసలాట జరుగుతోంది. ఎంతోమంది ఆశావహులు ఈ రేసులో ఉండగా ఛైర్మన్ పదవి టీడీపీ లేదా బీజేపీని వరిస్తుందని అందరూ అనుకున్నారు.