కోనసీమ: ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు 104 ఉద్యోగులు తమ సమస్యలపై సోమవారం వినతి పత్రం ఇచ్చారు. మురముళ్ల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేని కలిశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తమ వేతనాలు పెంచాలని కోరారు. 104లో పని చేస్తున్న డీఈవోలకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పరిగణించి జీతాలు చెల్లించాలని కోరారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు.