MDK: పెద్దశంకరంపేట మండలంలో ఏడేళ్ల బాలికపై అత్యాచార ఘటనలో నేరస్తుడు మోహన్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 5 వేల జరిమాన విధిస్తూ న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. బాలికకు పరిహారంగా రూ. 3 లక్షలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కేసులో శిక్ష పడేందుకు కృషి చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.