కోనసీమ: మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేయాలని మండపేట జేఏసీ కన్వీనర్ కామన ప్రభాకరరావు డిమాండ్ చేశారు. ఆయన నేతృత్వంలో జేఏసీ నాయకులు సోమవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా గ్రీవెన్స్‌లో వినతి పత్రం అందజేశారు.