అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షం వేళ బయటకు రావొద్దని హెచ్చరించారు. రెండు రోజుల క్రితం పడిన వర్షంతో జిల్లాలోని చెరువులు, వాగులు, వంకలు జలకళ సంతరించుకున్నాయి.