NLR: ఉలవపాడు మండలం బద్దిపూడికి చెందిన 37 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి సోమవారం ఎమ్మెల్యే నాగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన పాత, కొత్త నాయకులందరూ కలసికట్టుగా పని చేసి, కందుకూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.