KRNL: జిల్లాలో ఈనెలలో వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం చిప్పగిరిలో 99.8 మిమీ వర్షపాతం నమోదైంది. దీనితో ఆదోని, కౌతాళం, తుగ్గలి, మద్దికెర మండలాల్లో వందల ఎకరాల పంటలు నీటమునిగాయి. వ్యవసాయ యంత్రాంగం ప్రభుత్వానికి పంపిన ప్రాథమిక నివేదిక ప్రకారం, 1431 మంది రైతులు 1160 హెక్టార్లలో పంటలను నష్టపోయారు. సెప్టెంబర్ నెలలో నమోదైన వర్షపాతం సాధారణ స్థాయిలో ఉంది.