BHNG: పోచంపల్లి మండలం దేశముఖి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో సోమవారం ప్రఖ్యాత ఇంజినీరు, భారతరత్న అవార్డు గ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజినీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం. సుబ్బారావు మాట్లాడుతూ.. సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే వినూత్న ఆలోచనలు చేసే ఇంజనీర్లకు ఉజ్వల భవిష్యత్తు అన్నారు.