NDL: ప్యాపిలి పట్టణ పశువైద్యశాలలో మంగళవారం గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. పశుసంవర్ధక రంగం రైతుల ఆర్థిక పరిస్థితి బలోపేతానికి ప్రధాన భూమిక వహిస్తుందని, పశువుల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.