ATP: బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన అపర్ణ MBA పూర్తి చేసి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద రూ.15లక్షల నిధులు తీసుకున్నారు. ఆ డబ్బుతో “వంశీ మసాలా” యూనిట్ స్థాపించారు. రసం, సాంబార్, కారం, పసుపు పౌడర్ ఉత్పత్తి చేస్తూ విజయవంతంగా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 15 మహిళలకు ఉపాధి కల్పిస్తూ మహిళా సాధికారతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.