WGL: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలు వేయిస్తంభాల గుడిలో నేడు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ,సీతక్క హాజరు కానున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.