పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ మూవీ ఈ నెల 25న విడుదల కాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.150 కోట్లకుపైగా జరిగినట్లు సమాచారం. ఇతర భాషలు, ఓవర్సీస్ కలిపి సుమారు రూ.50 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూల్ చేయాలని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.