NRML: భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు వివరాలను అధికారులు ఆదివారం తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షానికి గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు 2000 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో రావడంతో అధికారులు ఒక గేటు ఏత్తివేసి 2,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358.70 ఉందని తెలిపారు.