GNTR: రాజధాని ప్రాంతంలో రూ. 400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బాహుబలి బ్రిడ్జి మరో 4 నెలల్లో పూర్తి కానుంది. ఈ బ్రిడ్జి 2 వైపులా నిర్మాణం పూర్తి కాగా, మధ్యలో పలుచోట్ల సౌర ఫలకాలను (సోలార్ ప్యానెల్స్) ఏర్పాటు చేశారు. వాటి ద్వారా రోజుకు 3 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానున్నట్లు తెలుస్తోంది. బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు ఇప్పటికే కొనసాగుతున్నాయి.