పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘OG’. ఈ నెల 25న ఇది విడుదల కాబోతుంది. అయితే ఇవాళ ఉదయం రిలీజ్ కావాల్సిన దీని ట్రైలర్ వాయిదా పడింది. ఇవాళ సాయంత్రం జరగనున్న ‘OG’ కాన్సర్ట్‌లో ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా తెలిపారు. ఇక DVV ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు.