ప్రకాశం: గిద్దలూరు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో మృతదేహం వద్దకు చేరుకున్నా రైల్వే పోలీసులు వృద్ధురాలి ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.