గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుకుమార్ ఓ సినిమా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటి కృతి సనన్‌ను కథానాయికగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆమె చరణ్ సరసన పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని సుకుమార్ భావిస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.