ఆపరేషన్ సిందూర్ తర్వాత మరోసారి నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కుప్వారాలోని నౌగామ్ సెక్టార్లో పాకిస్తాన్ కవ్వింపులకు దిగింది. దీంతో భారత సైన్యం ఎదురు కాల్పులు చేసి పాక్కు సమర్థంగా తిప్పికొట్టింది. సెప్టెంబర్ 20న సాయంత్రం 6:15 గంటలకు ఈ ఘటన జరగగా సుమారు గంటపాటు కాల్పులు కొనసాగాయి.