ప్రకాశం: కనిగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఇవాళ దేవి శరన్నవరాత్రి ఉత్సవములు సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమ అర్చనలు శ్రీనివాస శర్మ వైభవంగా నిర్వహించారు. అమ్మవారు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులుకు దర్శినమిచ్చారు. భారీగా వచ్చిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.