TG: రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు మిన్నంటాయి. ఇవాళ మూడో రోజు ముచ్చటగా ముద్దపప్పు బతుకమ్మగా పిలుచుకుంటారు. బతుకమ్మ ఆడిన తర్వాత ముద్దపప్పు, బెల్లం ఆప్యాయంగా ఇచ్చిపుచ్చుకుంటారు. ముద్దపప్పు జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. అమ్మను ‘ముద్గౌదనాసక్త చిత్తా’ అంటారు. ముద్దపప్పులో బెల్లం వేసి అమ్మకు నైవేద్యంగా సమర్పించి.. పిల్లలకు ప్రసాదంగా పంచిపెడతారు.