విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మంగళవారం పోర్టు ఛైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోర్టు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, ఎస్ఎల్ కాలువ నిర్మాణానికి సహకరిస్తున్నందుకు ఛైర్మన్‌కు వంశీకృష్ణ కృతఙ్ఞతలు తెలిపారు.