TG: కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. రాష్ట్రానికి సరిపడా ఎరువులు కేటాయించాలని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శిని మంత్రి కోరారు. దీనిపై స్పందించిన రజత్ కుమార్.. యూరియా పంపిణీలో తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.