SRD: జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని జిన్నారం-జంగంపేట ప్రధాన రహదారి పక్కన ఉన్న చెక్డాం మత్తడి దూకుతోంది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా చెక్ డ్యామ్ నిండిపోవడంతో అలుగు పారుతుంది. కాగా సోమవారం మధ్యాహ్నం రాయిని చెరువు అలుగు పారడంతో వరద ప్రవాహం జిన్నారం జంగంపేట ప్రధాన రహదారిపై పారుతుంది.