WGL: ఈ నెల 18న ప్రపంచ వెదురు దినోత్సవాన్ని మేదరి సంఘ సభ్యులు జయప్రదం చేయాలని మేదరి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దీకొండ ఉపేందర్ పిలుపునిచ్చారు. సోమవారం వర్ధన్నపేట మండలం ఇల్లందలో మేదరి సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టరేట్ ముందు ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని మేదరి కులస్తులు కులవృత్తి వస్తువులతో ప్రదర్శన చేపట్టాలని అన్నారు.