GDL: అలంపూర్ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఎంపీ మల్లు రవి సోమవారం సందర్శించారు. వంట గదిని పరిశీలించి వార్డెన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగు దొడ్లకు వెంటనే నీటి కనెక్షన్ ఇచ్చి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని వార్డెన్ ప్రసాద్‌కు ఆదేశించారు. వసతి గృహంలో కేవలం 40 శాతం మంది విద్యార్థులే ఉండడంపై ఆయన ఆరా తీశారు.