»Pakistan Man Takes Chained Tiger Out For A Stroll
Video: పులితో రోడ్డు మీద షికారు.. ఎక్కడంటే..?
బిజీగా ఉండే రోడ్డుపై పెద్ద పులి ప్రత్యక్షమైంది. దాని మెడకు తాడు ఉండగా.. పక్కన ఓ వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ రోడ్డు గుండా వెళ్లే ప్రయాణికులు మాత్రం ఆందోళన చెందారు.
Tiger: పెద్ద పులి (Tiger) అంటే ఎవరికైనా భయమే. కొందరు మాత్రం ఏ భయం లేకుండా ఉంటారు. వాటితో చక్కగా ఆడతారు. దానికి సంబంధించిన వీడియోలను మనం ఇదివరకు చూశాం. ఇక్కడ ఓ యువకుడు పులిని బయటకు తీసుకొచ్చాడు. ఆ పులి మెడకు తాడు కట్టి ఉంది. అయినప్పటికీ అది రోడ్డు మీద వెళ్లే వారిపై దాడి చేసేందుకు ట్రై చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.
ఈవినింగ్ వాక్
వీడియోను ఇన్ స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. టిప్ టాప్ యాత్ర పేరుతో పోస్ట్ చేశారు. కూరమృగాన్ని ఈవినింగ్ వాక్కు తీసుకొచ్చారు. దీంతో ప్రజల భద్రతపై భయాందోళన వ్యక్తం అవుతోంది. ఎవరైనా దాడి చేస్తే ఎలా అని జంతువుల సంక్షేమంపై కూడా ప్రశ్న వస్తోంది. ఈ ఘటన పాకిస్థాన్లో జరిగినట్టు తెలుస్తోంది. ఆరెంజ్ కలర్ టీ షర్ట్ వేసుకున్న యువకుడు ఆ పులిని బయటకు తీసుకొచ్చాడు.
దూకేందుకు ప్రయత్నం
తాడు కట్టి ఉండగానే ఆ పులి రోడ్డు మీద వెళ్లే వారి మీద దుంకేందుకు ప్రయత్నిస్తోంది. దానిని ఆపేందుకు అతను శ్రమించాడు. మళ్లీ ఇటు వైపు దాడి చేసేందుకు చూడగా.. కంట్రోల్ చేశారు. చివరకు తనను ఎక్కడ కరుస్తుందనే భయం కూడా అతనిలో ఉంది. ఆ బిజీ రోడ్డుపై పెద్ద పులిని తీసుకెళ్తూ కనిపించాడు. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. నెటిజన్ల కామెంట్లతో ఇన్ బాక్స్ నిండుతోంది.
మంచిది కాదు..?
ఇరువైపుల భద్రత, సంరక్షణ కోసం అడవీ జంతువులను పెంపుడు జంతువుగా ఉంచుకోవడం మంచిది కాదు. రోడ్లపైకి పులిని తీసుకురావడం ప్రమాదకరం అని ఒకరు రాశారు. ఇది ఎక్కడ జరిగింది.. పులిని పెంచడం చట్టబద్దమేనా అని మరొకరు అభిప్రాయం వ్యక్తం చేశారు.