»Vote In Loksabha Elections On May 13th And Get 20 Per Cent Off On Park Tickets At Wonderla Hyderabad
Wonderla : ఓటేస్తే వండర్లా టికెట్‌పై డిస్కౌంట్!
హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ అమ్యూజ్మెంట్ పార్క్ వండర్లా ఓటేసిన వారికి.. టికెట్‌పై డిస్కౌంట్ ప్రకటించింది. ఎంతో ఏంటో తెలుసుకోవాలని ఉంటే ఇది చదివేయండి.
Wonderla Amusement Park : పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అమ్యూజ్మెంట్ పార్కుల్లో అంతా సరదా సరదాగా గడిపేస్తుంటారు. హైదరాబాద్‌లో( Hyderabad ) ఉన్న ప్రముఖ అమ్యూజ్మెంట్ పార్క్ వండర్లా(wonderla). ఓటింగ్ శాతాన్ని పెంచే ఉద్దేశంతో ప్రత్యేక డిస్కౌంట్ని ప్రకటించింది. ఈ నెల పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసిన వారు ఈ పార్కు టికెట్‌పై ప్రత్యేక తగ్గింపును పొందవచ్చు.
ఓటేసిన సిరా గుర్తును చూపించి టికెట్ రేటుపై 20 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ వివరాలను వండర్లా(wonderla)వెల్లడించింది. మే 13న ఓటు వేసిన తర్వాత ఈ ఆఫర్‌ను 14,15 తేదీల వరకు వినియోగించుకోవచ్చని తెలిపింది. ఫుడ్ కంబోలపైనా 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ కేవలం హైదరాబాద్‌లో మాత్రమే అందుబాటులో ఉందని వెల్లడించింది.
ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో టికెట్లు కొనుక్కునే వారు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని వండర్లా(wonderla) తెలిపింది. మొన్న బెంగళూరులో పోలింగ్ జరిగినప్పుడు సైతం అక్కడి అమ్యూజ్మెంట్ పార్క్ టికెట్లపైనా ఇలాంటి ఆఫర్‌నే ప్రకటింది. ఇప్పుడు హైదరాబాద్‌లో మే 13న లోక్‌సభ ఎన్నికలు(Loksabha elections) జరగనున్న నేపథ్యంలో ఇక్కడా అదే ఆఫర్‌ని ప్రకటించింది. మే నెలలో బర్త్‌డేలు ఉన్న వారికి సైతం ఒక ఆఫర్‌ని ఇస్తోంది. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం అంటూ ప్రకటించింది. ఈ నెల 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.