రీసెంట్‌గానే నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి ఏడు అడుగులు వేసింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అయితే.. ఆమె భర్త 250 కోట్ల అప్పుల పాలైనట్టుగా బాలీవుడ్లో ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Bhagnani: గత కొన్నాళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ.. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అయితే.. రకుల్ పెళ్లి చేసుకుంది కదా..ఇకపై సినిమాలు చేస్తుందా? లేక సంసార జీవితానికే అంకితమవుతుందా? అనే డౌట్స్ ఉండేవి. కానీ రకుల్ మాత్రం తగ్గేదేలే అంటోంది. ఎప్పటిలాగే సినిమాలు చేస్తోంది. ఇప్పటికే పెళ్లికి ముందు రకుల్ కొన్ని ప్రాజెక్ట్స్‌కి కమిట్ అయింది. వాటిలో కొన్ని సెట్స్ పై ఉండగా.. మరికొన్ని ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సినిమాలతో పాటు.. కొత్త కథలు కూడా వింటోందట అమ్మడు.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. రకుల్ భర్త జాకీ భగ్నానీ అప్పుల పాలయ్యాడనే న్యూస్ షాకింగ్‌గా మారింది. హిందీ చిత్ర పరిశ్రమలోని పెద్ద ప్రొడక్షన్ బ్యానర్లలో పూజా ఎంటర్టైన్మెంట్ కూడా ఒకటి. ఈ సంస్థను జాకీ భగ్నాని తన తండ్రి వాషు భగ్నానితో కలిసి నడిపిస్తున్నాడు. అయితే.. ప్రస్తుతం ఈ సంస్థ పరిస్థితి ఏమాత్రం బాగా లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ ఉద్యోగులలో దాదాపు 80 శాతం మందిని తొలగించిందట. అలాగే.. ఆఫీస్‌ని జుహులోని డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌కి మార్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల రిలీజ్ అయిన బడే మియా ఛోటే మియా సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. 350 కోట్లతో రూపొందిన ఈ చిత్రం కేవలం 59 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా వల్ల నిర్మాణ సంస్థకి 125 నుంచి 150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. దీంతో.. ఫైనాన్షియర్లకు సుమారు 250 కోట్ల రుణాలు చెల్లించేందుకు.. వాషు భగ్నాని తన ఏడు అంతస్తుల పూజా ఎంటర్టైన్మెంట్ కార్యాలయాన్ని అమ్మేసినట్టుగా తెలుస్తోంది. ఈ బిల్డింగ్‌ని కూల్చివేసి విలాసవంతమైన భవనాన్ని నిర్మించనున్నట్టుగా సమాచారం.