Rakul Preet Singh Jackky Bhagnani : కొత్త పెళ్లి కూతురు రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త జాకీ భగ్నానీపై తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన భర్తకు సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువని అన్నారు. అదే తొలుత తనను ఆకర్షించిందని అన్నారు. ‘జాకీది మంచి మనసు. సెన్సాఫ్ హ్యూమర్ కలిగిన వ్యక్తి. అతడిలో ఉన్న టైమింగే తొలుత నన్ను ఆకర్షించింది. ఆయన ఎప్పుడూ సరదాగా ఉంటాడు. తన చుట్టూ ఉన్న వాళ్లను సంతోషంగా ఉండేలా చేస్తాడు.’అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
అస్సాం స్టేట్ ఫిల్మ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తాజాగా రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), జాకీ భగ్నానీ(Jackky Bhagnani) దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భగ్నానీ మాట్లాడుతూ తనకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువంటూ జాకీ మాట్లాడారు. ఆ మాటలను అందుకుంటూ రకుల్ ఆయనను పొగడ్తల్లో ముంచెత్తారు.
దాదాపు పది సంవత్సరాలుగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ నటిస్తున్నారు. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా నిర్మాత జాకీ భగ్నానీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో మునిగిపోయి ఉన్నారు. తాజాగా వీరిద్దరూ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.