పుదుచ్చేరి ప్రభుత్వాన్ని చూసి తమిళనాడులోని డీఎంకే సర్కార్ నేర్చుకోవాలని టీవీకే అధ్యక్షుడు విజయ్ హితవు పలికారు. వేరే రాజకీయ పార్టీ నిర్వహించే కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరికి భద్రత కల్పిస్తోందని కొనియాడారు. రానున్న పుదుచ్చేరి ఎన్నికల్లో టీవీకే పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ ఎన్నికల్లో తమ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.