»Five Killed As Three Bikes Collide In Andhra Pradesh Near Araku Valley
అరకు లోయ దగ్గర మూడు బైకులు ఢీ.. నలుగురు మృతి
అరకు లోయ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు బైకులు ఢీకొన్న ఘటనలో దురదృష్టవశాత్తూ నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
five killed in bapatla ap auto and lorry collision accident
Road Accident Near Araku Valley: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. మూడు బైకులు ఒక్కసారిగా ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం విశాఖ కేజేహెచ్కు తరలించారు. అరకులోయ సమీపంలోని మాదల పంచాయతీ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికీ తీవ్రంగా గాయాలయ్యాయి. మహా శివరాత్రి జాతరను నందివలస గ్రామంలో చూసేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో జరిగింది. మృతుల్లో చర్లపూడి గ్రామానికి చెందిన బురిడి హరి (22), అమ్మనాకాంత్(9), లోతేరు పంచాయతీ ముంజగుడకి చెందిన త్రినాథ్(32), భార్గవ్(4)లు ఉన్నారు.
మృతుల్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉండటంతో వారి వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గాయపడిన వారిని చినలబుడుకు చెందిన కిల్లో పరశురాం, సుజిత్ కుమార్, ఆర్ డుంబ్రిగుడకు చెందిన కిల్లో సంతోష్‌లు ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ రోడ్డు ప్రమాదం గురించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.