GDL: గద్వాల జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ట్యూటర్ల జీతాలు పెంచాలని బీసీ జిల్లా నాయకుడు గోంగోల ఈశ్వర్ కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న రూ.1,500 జీతాన్ని రూ.10,000కు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా నాయకురాలు మధురవాణి తదితరులు పాల్గొన్నారు.