TG: రాష్ట్రానికి కావాల్సిన యూరియాను ఒక సంవత్సరం ముందు నిల్వ చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత తలెత్తిందన్నారు. కేంద్రంపై సాకులు చెప్పకుండా.. ఎరువులు వచ్చే మార్గంపై దృష్టి పెట్టాలన్నారు. తన రాజకీయ జీవితంలో ఇంత బాధ్యత లేని ప్రభుత్వాన్ని చూడలేదని విమర్శించారు.