కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యా సాగర్ నాయుడు ఆదేశాల మేరకు, ఆత్కూరు SI నేతృత్వంలో వెస్ట్ బైపాస్ రోడ్డులో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వాహనాల అధిక వేగాన్ని నియంత్రించేందుకు రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు అక్కడ జిగ్–జాగ్ ట్రాఫిక్ డైవర్షన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ రోడ్డు భద్రతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు.