ప్రధాని నరేంద్ర మోడీ అస్సాంలో పర్యటిస్తున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వంగా గుర్తింపు పొందిన కజిరంగ జాతీయ పార్క్‌లో ఏనుగు సఫారీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Prime Minister Modi visited Kaziranga Park in Assam.. Safari on elephant
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) ఏనుగు సఫారీ చేసిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అస్సాం(Assam)లో పర్యటిస్తున్న మోడీ యూనిస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన కజిరంగ జాతీయ పార్క్(Kaziranga National Park)ను సందర్శించారు. అక్కడ ఏనుగు సఫారీ(elephant Safari ) చేసిన ప్రధాని దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 1957 తరువాత ఆ పార్కును సందర్శించిన రెండవ ప్రధాని నరేంద్ర మోడీనే కావడం విశేషం. రెండు రోజులు అక్కడే పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం తేజ్‌పూర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక ఛాపర్లో గోలాఘాట్ జిల్లాలోని కజిరంగకు వచ్చారు. నిన్న రాత్రి అదే పార్క్‌లో సేదతీరారు. ఈ రోజు ఉదయం అభయారణ్యంలో పర్యటించారు. ముందు ఏనుగు సఫారీ చేశారు. ఆ తరువాత జీపులో సఫారీ చేశారు. మోడీతో పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, సీనియర్ అటవి శాఖ అధికారులు ఉన్నారు. అక్కడే మహిళా ఫారెస్ట్ గార్డులతో ముచ్చటించారు. అనంతరం ఏనుగులకు చెరకు గడలు తినిపించారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు కజిరంగ పార్క్‌ను సందర్శించాలని, ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించాలని పేర్కొన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi visited Kaziranga National Park in Assam today. He also took an elephant safari here.
The PM also interacted with Van Durga, the team of women forest guards who are at the forefront of conservation efforts. During his visit, he also fed… pic.twitter.com/5sK46yQ6IS