MDK: గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. ఈ మేరకు ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లు, పరిశీలకులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. జిల్లాలోని 6 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.