MHBD: మరిపెడ మండలంలోని అమృనాయక్ తండా గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం అయ్యింది. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవ గ్రామ సర్పంచ్‌గా దరావత్ పద్మ ఎన్నికయ్యారు. గ్రామంలోని ఎనిమిది వార్డుల్లో కూడా వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో తండాలోని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.