అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో ముఖ్య నేతల పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. టీవీకే నేత సెంగోట్టైయన్ బంధువైన కె.కె.సెల్వన్ అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. సెల్వన్ నిన్నటి వరకు డీఎంకేలో కీలక నేతగా ఉన్నాడు. ఇప్పుడు అతను పార్టీ మార్చడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు మరో 50 మంది డీఎంకే నాయకులు అన్నాడీఎంకేలో చేరారు.