చక్రవర్తి రాజగోపాలచారి.. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. స్వతంత్ర భారతదేశానికి మొదటి, చివరి భారతీయ గవర్నర్ జనరల్. ఆయన మద్రాసు రాష్ట్రానికి సీఎం, కేంద్రహోంమంత్రిగా పనిచేశారు. రామాయణం, మహాభారతాలను ఇంగ్లీష్‌లో అనువదించారు. చక్రవర్తి తిరుమగన్ అనే తమిళ రచనకు సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. దేశానికి ఆయన చేసిన సేవలకుగానూ 1954లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు.