WGL: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ నెల 11న జరిగే మొదటి విడత పోలింగ్ నేపథ్యంలో, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు.