స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల ఫిబ్రవరిలో గోవాలో తన ప్రియుడితో కుటుంబ సభ్యుల సమక్షంలో చేసుకోబోతున్నట్లు సమాచారం.
Rakhul Preeth Singh: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గిల్లి అనే కన్నడ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్తో ఎంట్రీ ఇచ్చి తొలి విజయాన్ని అందుకున్న రకుల్ కొన్ని రోజులు స్టార్ హీరో హోదా పొందింది. స్టార్ హీరోల సరసన నటించింది. అయితే ప్రస్తుతం ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. కానీ బాలీవుడ్లో ఆఫర్లు తగ్గలేదు. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఎంతో కాలం నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. చాలా సందర్భాల్లో వీళ్ల పెళ్లి గురించి వార్తలు వచ్చాయి.
దీనికి రకుల్ సరైన సమయం చూసుకుని వివాహం చేసుకుంటామని చాలాసార్లు చెప్పారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి 22న గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్లో వీరి వివాహం జరగనుందని నెట్టింట్ వెడ్డింగ్ డేట్ వైరల్ అవుతోంది. ఆ తర్వాత సినీ ప్రముఖులకు ప్రత్యేకంగా విందు ఇవ్వనున్నారని సమాచారం. అయితే ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట వైరల్ కావడంతో సినీ ప్రియులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ విషయంపై రకుల్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.