»James Cameron Avatar Director Praises Rajamouli Again
James Cameron: మళ్లీ రాజమౌళిని ప్రశంసించిన అవతార్ దర్శకుడు
ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అవతార్ మూవీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అయితే ఆర్ఆర్ఆర్ సినిమాను రెండు సార్లు చూశానంటూ ఆస్కార్ ఈవెంట్లో తెలిపాడు. ఇదిలావుంటే తాజాగా కామెరూన్ మరోసారి రాజమౌళిపై ప్రశంసలు కురిపించాడు.
James Cameron: ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును కూడా ఈ సినిమా అందుకుంది. అయితే ఈ సినిమాపై హాలీవుడ్ దర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. అవతార్ మూవీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అయితే ఆర్ఆర్ఆర్ సినిమాను రెండు సార్లు చూశానంటూ ఆస్కార్ ఈవెంట్లో తెలిపాడు. ఇదిలావుంటే తాజాగా కామెరూన్ మరోసారి రాజమౌళిపై ప్రశంసలు కురిపించాడు.
James Cameron.. 🤗
Your precious words always inspire us to strive better and be the best.
హాలీవుడ్ ప్రతిష్టాత్మక 51వ సాటర్న్ అవార్డుల వేడుకలో పాల్గొన్న జేమ్స్ కామెరూన్ రాజమౌళిని మరోసారి అభినందించారు. ఈ ఈవెంట్లో రిపోర్టర్ మీరు ఎవరిని చూసి స్ఫూర్తిని పొందుతుంటారు అని కామెరూన్‌ను ప్రశ్నించగా.. తాను ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరి నుంచి స్ఫూర్తి పొందుతాను. స్పీల్ బర్గ్‌ని చూసుకుంటే ఆయన పని ఎప్పుడు కొత్తగా అనిపిస్తుంటుంది.
అలాగే కొత్తగా వస్తున్న దర్శకులకు వస్తున్న ఆలోచనలు నాకెందుకు రావడం లేదని బాధపడుతుంటా. ఈ మధ్య ఆర్ఆర్ఆర్ సినిమా చూశా చాలా అద్భుతంగా అనిపించింది. రాజమౌళి సూపర్‌గా తీశాడు. ఇండియన్ సినిమా వరల్డ్ వైడ్‌గా సత్తా చాటడం గొప్ప విషయమని కామెరూన్ వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.