Iswara Rao : ప్రముఖ సినీ నటుడు ఈశ్వర్ రావు కన్నుమూత
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు ఈశ్వర్ రావు కన్నుమూశారు. అక్టోబర్ 31న ఆయన మృతి చెందారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ఈశ్వరరావు (Actor Iswara Rao) కన్నుమూశారు. అక్టోబర్ 31న అమెరికాలోని కూతురి ఇంట్లో అనారోగ్యంతో కన్నుమూయగా,ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన మరణవార్తతో తెలుగు సినీ పరిశ్రమ దిగ్భాంతికి గురయింది. సోషల్ మీడియా (Social media) వేదికగా సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ‘స్వర్గం నరకం’ సినిమా ద్వారా సినీ పరిశ్రమకు ఈశ్వర్ రావు పరిచయం అయ్యారు. ఇదే సినిమాతోనే మోహన్ బాబు (Mohan Babu) కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే ఆయన నంది (కాంస్య) అవార్డును అందుకున్నారు.
బొమ్మరిల్లు,కన్నవారి ఇల్లు, తల్లిదీవెన (Talli divena) ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తన కెరీర్లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. పలు టీవీ సీరియళ్లలో కూడా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తొలి సినిమా స్వర్గం నరకం హిట్ అందుకున్న ఆయన కాంస్య నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత దేవతలారా దీవించండి, ప్రేమాభిషేకం, యుగపురుషుడు, దయామయుడు, ఘరానా మొగుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, జయం మనదే, శభాష్ గోపి వంటి విజయవంతమైన చిత్రాల్లో ఈశ్వరరావు నటించారు. చివరిసారిగా చిరంజీవి, నగ్మా నటించిన ఘరానా మొగుడు చిత్రంలో కనిపించారు.